హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతుండటంతో కేంద్ర ఎన్నికల సం ఘం స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (ఎస్సెస్టీ)లను ముందుగానే రంగంలోకి దించింది. ఎన్నికల ప్రభావాలను కట్టడి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 374 ఎస్సెస్టీలను రం గంలోకి దించారు. నియోజకవర్గానికి మూడు ప్రత్యేక బృందాలను పంపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాల్లో తప్పనిసరిగా మేజిస్ట్రేల్ స్థాయి అధికారి ఒకరు, నలుగురు పోలీసు సిబ్బంది, అవసరమైతే కెమెరామెన్ అందుబాటులో ఉంటారు.