హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 29: జేఈ ఈ మెయిన్ ఫలితాల్లో తమ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుత విజయాలను సాధించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి చెప్పారు. హనుమకొండ కాకాజీకాలనీలోని ఎస్సార్ కాలేజీలో శనివారం ఆ యన ఫలితాల వివరాలను వెల్లడించారు. జేఈఈ మెయిన్‌లో జాతీయస్థాయిలో రిజర్వేషన్ క్యాటగిరిలో బీ సమిత్ 7వ ర్యాంకు, జీ సాత్విక్ 20వ ర్యాంకు, చవన్ అఖిల 22వ ర్యాంకు, కే శ్రీవర్షిత్ 34వ ర్యాంకు సాధించారని తెలిపారు. జేఈఈ (అడ్వాన్స్డ్)కు ఇప్పటివరకు 2,786పైగా విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొన్నారు. కొడారి కార్తీక్ 44, ధరావత్ సాయిధీరజ్ 48, బానోత్ చరణ్ 92, బానోత్ నితీశ్ 109, షేక్ అబ్దుల్ సమీర్ 118, పృథ్వీరాజ్ తేజావత్ 167, బీ హార్దిక్ 167, సీ సోనిక 203, ఎండీ మొయినుద్దీన్ 215, ఐ నవీన్‌కుమార్ 232, పెండెం శ్రీకారి 322 ర్యాంకుతోపాటు ఇంకా 324, 343, 348, 357, 372, 403, 419, 458, 481, 497, 522, 528, 557, 563, 634, 651, 679, 728, 747, 770, 780, 784, 813, 814, 818, 848, 885, 924, 926, 951 ర్యాంకులను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని వివరించారు. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందనలు తెలిపారు.