SSC Exams | పదో తరగతి పరీక్షా పత్రం కాపీయింగ్‌లో కుట్ర కోణం ఉందని తేలిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండి పడ్డారు. చిన్న పిల్లలను మధ్యలోకి తెచ్చి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి హిందీ పరీక్షాపత్రం కాపీయింగ్ ఘటనలో వరంగల్ జిల్లాలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర కోణంపై వరంగల్ సీపీ స్పష్టంగా చెప్పారన్నారు. కుట్రలో భాగమైన వారికి పనిష్ మెంట్ ఇస్తాం అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎవరు నిర్లక్ష్యం చేసినా యాక్షన్ తీసుకుంటామని తేల్చి చెప్పారు.