Blueberries | పిల్లల మెదడు అభివృద్ధికి దోహదపడే బ్లూబెర్రీలు.. రోజూ ఇస్తే ఎన్నో ఉపయోగాలు..
బ్లూబెర్రీలు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఒకటిగా ఇప్పటికే గుర్తింపు పొందాయి. తాజాగా వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం, ఈ పండ్లలో ఉండే సహజ సమ్మేళనాలు పిల్లల్లో మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణకు తోడ్పడే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.
Blueberries | బ్లూబెర్రీలు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఒకటిగా ఇప్పటికే గుర్తింపు పొందాయి. తాజాగా వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం, ఈ పండ్లలో ఉండే సహజ సమ్మేళనాలు పిల్లల్లో మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణకు తోడ్పడే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ ప్రయోజనాలను పూర్తిగా నిర్ధారించేందుకు మరిన్ని దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు. బాల్యం అంటే మెదడు వేగంగా అభివృద్ధి చెందే కీలక దశ. ఈ సమయంలో నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భావోద్వేగాలు, సామాజిక ప్రవర్తన వంటి అంశాలు రూపుదిద్దుకుంటాయి. ప్రస్తుతం పిల్లల్లో ఆందోళన, నిరాశ, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆహారం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే మార్గాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు.
మెదడు కణాలకు రక్షణ..
బ్లూబెర్రీల్లో ఆంథోసయనిన్స్, ఫ్లావోనాల్స్, ఫీనాలిక్ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటంతో మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆంథోసయనిన్స్ రక్త-మెదడు అవరోధాన్ని దాటి నేరుగా మెదడుపై ప్రభావం చూపగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి మెదడు కణాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరచి జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యానికి మద్దతు ఇస్తాయి. అధ్యయనంలో పాల్గొన్న కొన్ని పరిశోధనల్లో బ్లూబెర్రీలు తీసుకున్న పిల్లలు జ్ఞాపకశక్తి పరీక్షల్లో, ముఖ్యంగా పదాలను గుర్తుంచుకోవడం, కొంత సమయం తర్వాత గుర్తు చేసుకోవడం వంటి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు గుర్తించారు. అలాగే ఏకాగ్రత, ప్రతిస్పందన వేగంలో కూడా కొంత మెరుగుదల కనిపించినట్లు నివేదించారు.
మెరుగయ్యే మానసిక స్థితి..
బ్లూబెర్రీలు పిల్లల మానసిక స్థితిపైనా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కసారి బ్లూబెర్రీలు తీసుకున్న తర్వాత కూడా కొందరు పిల్లలు, యుక్తవయస్కుల్లో సానుకూల భావోద్వేగాలు పెరిగినట్లు గుర్తించారు. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే ప్రాంతాలకు రక్తప్రసరణ మెరుగుపడటంతోపాటు సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లపై ప్రభావం చూపడం ఇందుకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఏకాగ్రత, ప్రణాళిక రూపొందించడం, సమస్యలను పరిష్కరించడం, స్వీయ నియంత్రణ వంటి కార్యనిర్వహణ సామర్థ్యాలను కూడా బ్లూబెర్రీలు మెరుగుపరుస్తాయని అధ్యయనం సూచిస్తోంది. ఇవి పిల్లల విద్యాభ్యాసం, సామాజిక ప్రవర్తనలో కూడా సానుకూల మార్పులకు దోహదపడే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు..
పేగుల ఆరోగ్యం, మెదడు పనితీరు మధ్య సంబందాన్ని కూడా ఈ పరిశోధనల్లో ప్రస్తావించారు. బ్లూబెర్రీల్లోని సమ్మేళనాలు మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది పరోక్షంగా మెదడు పనితీరు, భావోద్వేగ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా విస్తృత పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు. బ్లూబెర్రీలను ప్రవర్తనా సమస్యలు లేదా నాడీ అభివృద్ధి సంబంధిత రుగ్మతలకు చికిత్సగా పరిగణించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు తక్కువ మంది పాల్గొనేవారితో లేదా స్వల్పకాలం మాత్రమే నిర్వహించినందున మరింత విస్తృత పరిశోధనలు అవసరమని చెబుతున్నారు. అలాగే పిల్లలకు బ్లూబెర్రీ సప్లిమెంట్లను స్వయంగా ఇవ్వకుండా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి సురక్షిత మోతాదుపై ఇంకా స్పష్టత లేకపోవడంతో సప్లిమెంట్ల కంటే తాజా బ్లూబెర్రీలు లేదా తక్కువగా ప్రాసెస్ చేసిన బ్లూబెర్రీ ఉత్పత్తులను ఆహారంలో భాగంగా తీసుకోవడం మరింత సురక్షితమైన ఎంపికగా చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- blueberries
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

