
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి నిత్య కైంకర్యాలు శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్ర హాలను పట్టు వస్ర్తాలు, స్వర్ణ అభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసి అర్చనలు చేపట్టారు.
లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయంలో అత్యంత ప్రతి ష్టాత్మకంగా జరుపు కునే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామిని ఆరాదిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు.
స్వామిని దర్శించుకున్న రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భం గా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వామి వారి వేద శీర్వచనం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.