
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి. జనవరి నెలకు సంబంధించి రోజుకు 10 వేల చొప్పు న టీటీడీ సోమవారం టికెట్లు విడుదల చేసిం ది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల టికెట్లు, మిగిలిన రోజుల్లో 10 వేల చొప్పున టికెట్లను టీటీడీ ఆన్లైన్లో ఉంచింది. విడుదలైన 15 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకొన్నారు.
నేడు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లు
శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లు మంగళవారం ఆన్లైన్లో విడుదల కానున్నాయి. జనవరి, ఫిబ్రవరి కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నది. జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు , 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు విడుదల చేస్తారు. 14 నుంచి 22 వరకు రోజుకు 2 వేల చొప్పున లఘు దర్శన టికెట్లు (రూ.500), జనవరి, ఫిబ్రవరి నెలల్లోని మిగతా రోజుల్లో బ్రేక్ దర్శన టికెట్లు కూడా విడుదల కానున్నాయి.
సిఫారసు లేఖల రద్దు
శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. జనవరి 1న, 13 నుంచి 22 వరకు సిఫారసు లేఖల స్వీకరణ ఉండదని పేర్కొన్నది.