హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ బస్సులో వచ్చిన భక్తులకు రూ.300 దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రోజుకు వెయ్యి మందికి ఈ అవకాశం కల్పిస్తామని తెలిపింది. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ చేసిన విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణానికి రెండు రోజుల ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకొనేవారికి ఈ టికెట్లు ఇస్తారు. ప్రయాణికులు రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా దర్శనానికి 72 గంటల లోపు పొందిన కొవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని టీటీడీ సూచించింది.