హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ.5 వేలు కేటాయించింది. ఆగస్టు నెల కోసం మొత్తం రూ.25.05 లక్షలు విడుదల చేసింది. ఇక నుంచి ప్రతినెలా నిధులు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది.