ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ.5 వేలు కేటాయించింది.
శ్రీవాణి ట్రస్టు ద్వారా వస్తున్న విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతను పాటిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు.