హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): శ్రీశైల మల్లికార్జునస్వామి ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, ఏపీ డీజీపీ ఆరే మీనా సోమవారం దర్శించుకున్నారు. వారికి ఈఓ పెద్దిరాజు, అర్చకులు, స్వామివారి చిత్రపటం, ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.
ఎస్సై వీరంగం
నాగర్‌కర్నూల్, జూలై 29 : నాగర్‌కర్నూల్‌లో మిడిదొడ్డి రంజిత్ ఆదివా రం రాత్రి బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. హౌసింగ్ బోర్డు వద్ద పాన్‌గల్ ఎస్సై కల్యాణ్‌రావు కారులో అక్కడే యూ టర్న్ చేసే సమయంలో రెండు వాహనాలు ఎదురుపడ్డాయి. ఆగ్రహానికి గురైన సదరు ఎస్సై పోలీస్ కారుకే అడ్డం వస్తావా? అంటూ రంజిత్‌తో గొడవకు దిగాడు. యువకుడిపై పిడిగుద్దులు కురిపించడంతోపాటు కిందపడే సి బూటు కాళ్లతో తొక్కాడు. అక్కడి ను ంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి మళ్లీ దాడి చేసినట్టు బాధితుడు పేర్కొన్నాడు.