హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తేతెలంగాణ): ఏపీలోని శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆలయ ఈవో శ్రీనివాసరావు సంబంధిత విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి రోజు ప్రభుత్సవం, పాగా అలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం జరుగనున్నట్టు ఈవో తెలిపారు. 16న మల్లిఖార్జునస్వామి, అమ్మవారి రథోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.