Srisailam Dam | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. ఏడుగేట్లు ఎత్తివేత..
Srisailam Dam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. దాంతో అధికారులు ఏడుగేట్లు ఎత్తి 1.86లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌కు 4.02లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. అవుట్ ఫ్లో 2.50లక్షల క్యూసెక్కులుగా ఉన్నది.
Srisailam Dam | శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. దీంతో అధికారులు ఏడు క్రస్ట్‌గేట్లను 10 అడుగులమేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి నుంచి 19,653 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల ద్వారా 2,61,543 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. సుకేశుల నుంచి 1,07,246 క్యూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 3,88,460 క్యూసెక్కుల నీరు చేరుకోగా.. రిజర్వాయర్ నుంచి 4,13,178 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైనట్లు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 207 టీఎంసీలుగా ఉన్నది.
కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 25,684 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి ద్వారా చేసి దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మరో వైపు శ్రీశైలం జలాశయం డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం రహదారులన్నీ పర్యాటకులతో సందడిగా మారాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు శ్రీశైలం బాటపడుతున్నారు. మరో వైపు రిజర్వాయర్‌కు వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా ఎవరూ వెళ్లొద్దని సీఐ ప్రసాదరావు హెచ్చరించారు. మంగళవారం ఉదయం టూరిజంశాఖ అధికారులకు, మత్స్యకారులకు నోటీసులు జారీ చేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు పడవలు నడపొద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

