హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో ఒకటైన శ్రీసాయి హరిహర ఎస్టేట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మూడు ప్రాజెక్టులను ఏకకాలంలో నిర్మిస్తోంది. ఇందులో ‘హరిహరాస్ వసంత్ విల్లాస్’ అనే లగ్జరీ విల్లా ప్రాజెక్టును కీసర అవుటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వద్ద, ‘హరిహరాస్ శ్రీసాయి విరాద్య’ అనే ప్రీమియం హైరైజ్ కమ్యూనిటీ ప్రాజెక్టును ఉప్పల్ వద్ద, ‘హరిహరాస్ శ్రీ సాయి కాకతీయ అనే పేరుతో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీని వరంగల్ హైవేకు దగ్గరలో గల పోచారం వద్ద నిర్మిస్తోంది.
కీసర వద్ద గల లగ్జరీ విల్లా ప్రాజెక్టులో 6 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో 69 ట్రిప్లెక్స విల్లాలను నిర్మిస్తోంది. వీటిని 187 చదరపు గజాల విస్తీర్ణంలో మరియు 223 చదరపు గజాల విస్తీర్ణంలో 3000 చదరపు అడుగుల మరియు 3700 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద క్లబ్ హౌస్‌తో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టు, చిల్డ్రన్ ప్లే పార్కు, బ్యాంకెట్ హాల్, కాన్ఫరెన్స్ హాల్‌తోపాటు అత్యంత ఆధునిక సెక్యూరిటీ వ్యవస్థతో గేటెడ్ కమ్యూనిటీని నిర్మస్తోంది.
అలాగే శ్రీసాయి విరాద్య అనే ప్రాజెక్టును 2.14 ఎకరాల విస్తీర్ణంలో 214 యూనిట్లతో 1179 చదరపు అడుగుల నుండి 2359 చదరపు అడుగుల విస్తీర్ణంతో 3 బెడ్రూమ్ లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. ‘హరిహర ఎస్టేట్స్ శ్రీసాయి కాకతీయ’ అనే ప్రాజెక్టును 3.09ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో 360 ఫ్లాట్లను రెండు టవర్లలో నిర్మిస్తోంది. ఇందులో 1335 చదరపు అడుగుల విస్తీర్ణంలో నుంచి 1600 చదరపు అడుగుల విస్తీర్ణంతో రెండు మరియు మూడు బెడ్రూమ్ల అపార్ట్మెంట్స్ అందుబాటులో కలవు. దీనిలో చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్‌పూల్, బాస్కెట్‌బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు వంటి ఆధునిక సదుపాయాలు కలవు. ఈ మూడు ప్రాజెక్టులు కూడా రెరా అనుమతి కూడా పొందాయి.