హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : జలవనరుల అంశాలకు సంబంధించి మహారాష్ట్ర సీఎం సలహాదారుగా కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నియమితులయ్యా రు. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జా రీచేసింది. సీఎంకు జలవనరుల అంశాలపై మా ర్గనిర్దేశనం, విధానపర నిర్ణయాల్లో సలహాలు, సూ చనలు ఇవ్వనున్నారు.
రాష్ట్ర మంత్రి హోదాకు స మానమైన స్థాయిలో వెదిరె శ్రీరామ్‌ను అడ్వైజర్‌గా నియమించి ంది. రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ ను విజయవంతంగా అమలు చేసేందుకు ఓ టెక్ని కల్, దీర్ఘకాలిక విధాన ప్రణాళిక, సమన్వయం కో సం ఓ నిపుణుడిని నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, అం దులో భాగంగానే శ్రీరామ్‌ను నియమి ంచామని ‘మహా’ సర్కారు పేరొంది.