హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పోలీస్ అకాడమీ కొత్త డైరెక్ట ర్గా ఏడీజీ వీవీ శ్రీనివాసరావును నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం బాధ్య తలు స్వీకరించారు. ఇప్పటివరకు డైరెక్ట ర్గా ఉన్న డీజీ అభిలాష బిస్త్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీవింగ్ ఆర్డర్ అందుకున్న అభిలాష బిస్త్.. పలు పెండింగ్ ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అకాడమీ సిబ్బంది ఆమెను సన్మానించి వీడ్కోలు పలికారు.