హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చైర్మన్‌గా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వివాదాస్పద నిర్ణయాలు, అవినీతి ఆరోపణలకు కేరాఫ్‌గా నిలిచిన సీఎం కార్యదర్శి అజిత్‌రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా ట్రాన్స్ఫర్ చేసింది.
ఇక ఆయననే శనివారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార పౌర సంబంధాల శాఖలో క్రియేటివ్ డైరెక్టర్‌గా రాజు కొండను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ కమిషనర్ జీ ముకుంద రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.