కేటీదొడ్డి, డిసెంబర్ 27: ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామానికి చేరిన దరఖాస్తు పత్రాలను.. కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌రెడ్డి బలవంతంగా గుప్పిట్లోకి తీసుకున్నారు. మొత్తం 457 దరఖాస్తు పత్రాలు రాగా.. 441 పత్రాలను తీసుకెళ్లారు. పంచాయతీ కార్యదర్శిని బెదిరించి దౌర్జన్యంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో తమకు కూడా పథకాలు కావాలని అక్కడున్న మహిళలు ప్రశ్నించగా.. ‘మీరు మా పార్టీకి ఓటేయలేదు.. మా పథకాలు మీకెందుకు? వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి ఓటేస్తామని చెప్తేనే మీకు ఇస్తాం’ అంటూ దూషించారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయాన్ని కార్యదర్శి ధ్రువీకరించాడు.