హైదరాబాద్ : ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న మహబూబ్‌నగర్(Mahabubnagar) మున్సిపల్ అధికారులు ఆదర్శనగర్‌లోని ఇండ్లను కూల్చి వేయడంతో దివ్యాంగుల కుటుంబాలు (Homeless victims) రోడ్డున పడ్డాయి. ఇండ్లు కులగొట్టిన ప్రాంతంలో అక్కడే టెంట్లు వేసుకొని తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్న వారికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అండగా నిలిచారు. బాధిత కుటుంబాలకు అల్పాహారం అందించాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఆయన సూచనల మేరకు స్థానిక నాయకులు అల్పాహారం అందజేశారు.
కాగా, హైదరాబాద్‌లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఆదర్శనగర్‌లోని పేదల ఇండ్లను గురువారం తెల్లవారుజామున కూల్చివేశారు. భారీ బందోబస్తుతో రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లతో వచ్చిన అధికారులు.. పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలను నేలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే సుమారు 75 ఇండ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే.
ఇండ్లు కూలగొడితే దిక్కు లేక అక్కడే టెంట్ వేసుకొని ఉంటున్న వికలంగుల కుటుంబాలు
మహబూబ్ నగర్ పరిధిలోని 523 సర్వే నెంబర్ ఆదర్శ నగర్లో ఇండ్లు కులగొట్టిన ప్రాంతంలో అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్న వారికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన మేరకు అల్పాహారం అందించిన స్థానిక… https://t.co/UWzxHNIHI5 pic.twitter.com/ZJEd6IRGZE
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2024