అన్నదాతల అరిగోస పట్టదా.. రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు అప్రకటిత కరెంటు కోతలతో ఎండిపోతున్నాయని, ప్రజా ప్రభుత్వానికి అన్నదాతల అరిగోస పట్టదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలను మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
- చంద్రధనలో పంటల పరిశీలన
కడ్తాల్, ఏప్రిల్ 19 : ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు అప్రకటిత కరెంటు కోతలతో ఎండిపోతున్నాయని, ప్రజా ప్రభుత్వానికి అన్నదాతల అరిగోస పట్టదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలను మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల సంఖను పెంచాలని, రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో చూసిన కరెంటు కోతలు, ఎండిపోయిన పంటలు, కాలిపోయిన మోటర్లు, యూరియా కోసం క్యూలైన్లను మళ్లీ కాంగ్రెస్ పాలనలో చూస్తున్నామని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు రైతులకు, ప్రజలకు శాపంగా మారాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిర్మలాశ్రీశైలంగౌడ్, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

