హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే అదేశాలు జారీ చేసినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. మంగళవారం శంషాబాద్‌లో గౌడ సంఘం నాయకులతో సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు.
సర్వాయి పాపన్న జయంతి ఈ నెల 18న ఉందని, ఈ లోగా విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజనైనా చేయాలని డిమాండ్ చేశారు. పాపన్న కేవలం గౌడ్ సామాజిక వర్గానికి మాత్రమే కాదని, బహుజనులకు ఆయన రాజు అని పేర్కొన్నారు. లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆయన చరిత్ర, విగ్రహం భద్రంగా ఉన్నాయని వివరించారు. కుల వృత్తుల వారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘం నాయకులు సురేశ్‌గౌడ్, నవీన్‌గౌడ్, నీలంగౌడ్, భాస్కర్‌గౌడ్, ఆనంద్‌గౌడ్, శ్రీనివాసగౌడ్, చంద్రశేఖర్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.