హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్-గోవా చీఫ్ అడ్వయిజర్‌గా మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. గోవాలోని ఓ హోటల్లో రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ఆధ్వర్యం లో బుధవారం నిర్వహించిన సమావేశానికి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవా చీఫ్ అడ్వయిజర్‌గా శ్రీనివాస్‌గౌడ్‌ను ఎన్నుకున్నారు. తెలంగాణలో మాదిరిగా గోవాలో కూ డా ఓబీసీల సంక్షేమ పథకాల అమలు కు కృషి చేయాలని వివిధ సంఘాలు ఆ యనకు విజ్ఞప్తి చేశాయి.
అనంతరం శ్రీ నివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్ర భుత్వం జనగణనతోపాటు కులగణన చేసి, జనాభా ప్రాతిపదికన ఓబీసీ రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ తరహా గోవాలో మహా త్మా జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ సూ ళ్లు, కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రీ య ఓబీసీ మహాసంఘ్ గోవా రాష్ట్ర అ ధ్యక్షుడు మధు అనంత్‌నాయక్, వైస్ ప్రెసిడెంట్ నోను నాయక్, ఫిషరీస్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు పద్మనాభ అమోడర్, నాభిక్ సమాజ్ సెక్రటరీ లాడ్‌సులాకర్ పాల్గొన్నారు.