హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేస్తున్న టీ శ్రీనాథ్రావును గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్(అడ్మిన్) హోదాలో ఎస్‌హెచ్‌జీల డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
టీజీఎస్వోసీఏ డైరెక్టర్‌గా డాక్టర్ కిరణ్‌కుమార్
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ(టీజీఎస్వోసీఏ) డైరెక్టర్‌గా ప్రొఫెసర్ డాక్టర్ అడపా కిరణ్‌కుమార్‌ను నియమించింది. వ్యవసాయశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.