హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): క్వారీల వద్ద ఇసుక తవ్వకాలు పెంచడంతోపాటు విక్రయాలు పెంచాలని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కోటి టన్నుల కన్నా ఎక్కువ ఇసుక వెలువడే రెండు మూడు క్వారీలను గుర్తించాలని ఆయన సూచించారు.
అక్రమాలను అరికట్టే పేరుతో ఇసుక రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో ఇసుక ధరలు భారీగా పెరిగి రవాణా స్తంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శ్రీధర్ భూపాలపల్లి జిల్లాలోని పలు ఇసుక క్వారీల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఇసుక తవ్వకాలు పెంచాలని ఆదేశించారు.