మహబూబాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలను అందంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
మహబూబాబాద్(Mahaboobabad) జిల్లా కేంద్రం గాంధీ పార్క్ ( మిథిలా నగరము) వద్దగల రామ మందిరంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod), ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పాల్గొని పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి సత్యవతి రాథోడ్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
వనపర్తి జిల్లా(Vanaparthy) కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan rddy) దంపతులు పూజల్లో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, ఖిలావనపర్తి ఆలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాలకుర్తి(Palakurthy) నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలను సతీమణి ఉషా దయాకర్ రావు తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు, తొర్రూరు, నాంచారి మడూరు, వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి తదితర దేవాలయాల్లో కళ్యాణోత్సవాలకు మంత్రి హాజరయ్యారు.
సూర్యాపేట(Suryapeta)లోని బొడ్రాయి బజార్ లోని శ్రీ వేదాంత భజన మందిరంలో జరిగిన శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish), సునీత దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు అందజేశారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయంలో జరిగిన కళ్యాణంలో ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. నల్లగొండ లోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, పాలకమండలి చైర్మన్ లకు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, పూజా ద్రవ్యాలు భక్తిశ్రద్దలతో అందజేశారు.