యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1న ప్రారంభమై 11న ముగుస్తాయని ఆలయ ఈవో భాస్కర్రావు గురువారం తెలిపారు. 1నుంచి 3 వరకు సహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ‘నృసింహ వైభవం’ ఆధ్యాత్మిక ప్రవచనం, 9వ తేదీవరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 7న స్వామివారి ఎదుర్కోలు, 8న తిరుకల్యాణం, 11న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ము గింపు పలుకుతామని చెప్పారు. ఈ సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హో మం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు.