హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు రికార్డు సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక్క తెలుగు రాష్ర్టాల నుంచే 300/300 మార్కులతో ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 1వ ర్యాంకు వంగా అజయ్‌రెడ్డి (హెచ్‌టీ నెం. 250310255592)తోపాటు, దేవ్‌దత్తా మాఝీ (హెచ్‌టీ నెం. 250310016185 డీఎల్పీ) 1వ ర్యాంకు, టీ శివెన్ (హెచ్‌టీ నెం. 250310391420 డీఎల్పీ) 9వ ర్యాంకు ఎస్ జిందల్ (హెచ్‌టీ నెం. 250310236696 డీఎల్పీ) 10వ ర్యాంకుతో టాప్ 10లో 4 ర్యాంకులు, 100లోపు 27 ర్యాంకులు, 1000లోపు 150పైగా ర్యాంకులు సాధించారని వివరించారు. గత మూడేండ్లలో తెలుగు రాష్ర్టాల నుంచి 300/300 మార్కులు సాధిస్తూ హ్యాట్రిక్ రికార్డు సృష్టించడం శ్రీచైతన్యకే సాధ్యమైందని అన్నారు. ఒకే సంవత్సరంలో మూడు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ఓపెన్ క్యాటగిరీలో మూడు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులతో హ్యాట్రిక్ సాధించిన ఘనత కూడా శ్రీచైతన్యదేనని చెప్పారు. ఇంతటి ఘన విజయాలకు కారణమైన శ్రీచైతన్య అనితరసాధ్యమైన ప్రోగ్రామ్‌లు, మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్స్ సిస్టమ్, ఇన్ఫినిటీ లెర్న్ ఆన్లైన్ యాప్, నిరంతరం శ్రమించే టాప్ ఫ్యాకల్టీ వల్లే ఇది సాధ్యమైందని ఆమె హర్హం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు.
జేఈఈలో గురుకుల విద్యార్థుల ప్రతిభ ;ఎస్సీ సొసైటీ నుంచి 525 మందికి అధిక మార్కులు
హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తంగా 588 మంది విద్యార్థులు అత్యధిక పర్సంటైల్ సాధించి అర్హత సాధించారు. 525 మంది 61 పర్సంటైల్ కంటే అధిక మారులు సాధించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నుంచి 525 మంది విద్యార్థులు 61 పర్సంటైల్ కంటే అధికంగా మారులు సాధించి అర్హత సాధించారు. 90కు పైగా పర్సంటైల్ 40మంది, 80కు పైగా పర్సంటైల్ 164మంది విద్యార్థులు సాధించడం విశేషం. బీసీ గురుకులం నుంచి కూడా 90కిపైగా పర్సంటైల్‌ను 9మంది విద్యార్థులు సాధించగా, 63 మంది విద్యార్థులు మెయిన్‌కు క్వాలిఫై అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ, ఎస్సీ గురుకుల సొసైటీల కార్యదర్శులు సైదులు, అలుగు వర్షిణి అభినందించారు.