హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు అద్భుత విజయాలు నమోదు చేశాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది శ్రీచైతన్య విద్యార్థులు మునుపెన్నడూ లేనివిధంగా సంచలన రికార్డులు సృష్టించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థి పసల మోహిత్ 100 పర్సంటైల్ సాధించి ఇండియాలోనే ఒకే ఒక్కడిగా నిలిచాడు.
అలాగే 290, 285, 280 మార్కులతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు సత్తాచాటారు. ఈ అద్భుత ఫలితాలపై శ్రీచైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మ హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థుల కఠోర శ్రమ, సాటిలేని అకాడమిక్ ప్రోగ్రామ్స్, పక్కాగా రూపొందించిన షెడ్యూల్స్, అంతర్గత పరీక్షలు ఈ విజయానిక కారణమని తెలిపారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని యాజమాన్యం అభినందించింది.