ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ‘స్పాట్’ అడ్మిషన్లు
- ఏడాది నుంచి సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్‌కు గ్రీన్‌సిగ్నల్
- 1400 పైగా మురిగిపోయే సీట్ల భర్తీకి అనుమతి
- రిజిస్ట్రేషన్‌కు నేడు తుది గడువు
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ ద్వారా రాష్ట్రంలోని సర్కారీ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లన్నీ భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆయా ఫీజులను కూడా ఖరారు చేశారు. ప్రతి ఏటా పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. గతంలో సెంట్రలైజ్డ్ స్పాట్ అడ్మిషన్స్ విధానం ద్వారా ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే సీట్లను భర్తీ చేసేవారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ విధానం అమలు చేయకపోవడంతో ప్రతి ఏటా 1,400పైగా సీట్లు మురిగిపోయేవి. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లకు తీవ్రపోటీ ఉన్నా.. కౌన్సెలింగ్‌లో మాత్రమే సీట్లను భర్తీచేసేవారు. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా భర్తీచేయాలని ఇటీవలే నిర్ణయించారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం విద్యార్థులు ఈ నెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 13 వరకు వెబ్ ఆప్షన్స్, 16న సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఫీజులు ఇలా..
- పాలిసెట్ క్వాలిఫై అయ్యి స్పాట్ అడ్మిషన్స్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఏడాదికి రూ. 16,330, ఇతర అభ్యర్థులు రూ.16,780 ఫీజుగా చెల్లించాలి.
- పాలిసెట్ క్వాలిఫై, క్వాలిఫై కాని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఏడాదికి రూ. 16,080, ఇతర అభ్యర్థులు రూ. 16,380 ఫీజుగా చెల్లించాలి.
- పాలిసెట్‌లో అర్హత సాధించని విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో అదనంగా ఎస్సెస్సీ పాస్ మెమో, కుల ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్చేయాలి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

