హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఫార్మసీ కోర్సుల్లో సీట్లను భర్తీచేసే ఎప్‌సెట్(బైపీసీ) స్పాట్ అడ్మిషన్ల గడువును 30 వరకు పొడిగించినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఏ శ్రీదేవసేన తెలిపారు. ఈ గడువు మంగళవారంతో ముగియగా, ఈ నెల 30 వరకు పొడిగించామని తెలిపారు.
నేటి నుంచి సీపీగెట్ తుది విడత కౌన్సెలింగ్
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : పోస్టు గ్రాడ్యుయేట్ కో ర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. బుధవారం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభంకానున్నది. అభ్యర్థులు నవంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
బడుల్లో ఆపరేషన్ క్లీనింగ్
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లో మిషన్ క్లీనింగ్ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. చెత్తను తొలగించి, పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది. బడులకు 50% స్కూల్ గ్రాంట్‌ను విడుదల చేశామని, ఆ నిధులతో ఈ పనులు చేపట్టాలని ఆదేశాలిచ్చింది.
ఒకే కలర్లో సర్కారు కాలేజీలు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కా లేజీలకు ఒకే రకమైన కలర్లు వేయాలని ఇంటర్ విద్యాశాఖ సూచించింది. కాలేజీన్ని కామన్ కలర్ అనుసరించాలన్నది. భవనాలకు తెలుపురంగు, బార్డర్ కోసం నీలం రంగు వినియోగించాలని సూచించింది.