నర్మెట/బయ్యారం, జూన్ 10 : అం గన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన కోడిగుడ్లు అందజేస్తుండటంతో చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో చిన్నారి తల్లి, జనగామ జిల్లాలో చిన్నారి అస్వస్థతకు గురయ్యారు. జనగామ జిల్లా నర్మెట మం డలం మల్కపేటకు చెందిన బానోత్ అశో క్ కూతురు ఆద్య శుక్రవారం అంగన్వా డీ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉడకబెట్టిన కోడిగుడ్డు, కురుకురే తినగా వాంతులు చేసుకున్నది. వెంటనే తల్లిదండ్రులు దవాఖానకు తీసుకెళ్లగా ఫుడ్ పాయిజన్ అయినట్టు వైద్యులు తెలిపారు. అంగన్వాడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా సోమవారం ఐసీడీఎస్ సీడీపీవో రమాదేవి, సూపర్వైజర్ సుమతి కేం ద్రాన్ని సందర్శించి కోడి గుడ్లు, కురుకురే ప్యాకెట్లను పరిశీలించారు. కుళ్లిపోయిన కోడిగుడ్లను చూసి మండిపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేటకు చెందిన పసుపులేటి సతీశ్, స్రవంతి దంపతులకు 16 నెలల చిన్నారి శ్రావిక ఉన్నది. వారం రోజుల క్రితం స్థానిక అంగన్వాడీ సెంటర్-2లో నెల రోజుల కోసం 16 గుడ్లు అందించారు. చిన్నారికి గుడ్డు తినిపించేందుకు సోమవారం ఉడక పెట్టగా తి నేందుకు వీలు లేకుండా నల్ల్లగా మారిం ది. మిగతా గుడ్లను పగులగొట్టి చూడగా కుళ్లిపోయి దుర్వాసన రావడంతో కడుపులో తిప్పి స్రవంతి వాంతులు చేసుకున్నది. నెల రోజుల క్రితం పంపిణీ చేసిన గుడ్లు సైతం బాగా లేకపోవటంతో చిన్నారికి పెట్టకుండానే పారేశామని, నిర్వాహకులకు చెప్పినా పట్టించుకోలేదని స్రవం తి వాపోయింది. రెండు నెలలుగా గుడ్లు సరిగా రావటం లేదని తెలిపింది.