హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 18,180 మంది ఉపాధిహామీ కూలీలకు ఒక్కొక్కరికి రూ.ఆరు వేల చొప్పున ఆత్మీయ భరోసా అందజేసినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం వారి ఖాతాల్లో నగదు జమ చేశామని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సర్కారు రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధిహామీ కూలీలకు ఆర్థిక సాయం అందించడం చరిత్రాత్మకమని చెప్పారు.