హైదరాబాద్: హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో (Mint compound) విషాదం చోటుచేసుకున్నది. తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ (Gun Miss fire) అవడంతో కానిస్టేబుల్ రామయ్య మృతి చెందారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) హెడ్ కానిస్టేబుల్ రామయ్య (46).. మింట్ కాంపౌండ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం తుపాకీని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయిందని, దీంతో తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
వెంటనే నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ అధికారులు.. ఆ ప్రాంతాన్ని పరిశీస్తున్నారు.