హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ సొరంగం పనులను త్వరితగతిన పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అందులో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వేను, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ద్వారా లిడార్ సర్వేను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఇరిగేషన్‌శాఖలో 47మంది ఇంజినీర్లకు సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)లుగా 127మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు (ఏఈఈ)లకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ)లుగా ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది.