హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఆధునిక హంగులతో నిర్మాణమవుతున్న నూతన సచివాలయంలో రెడ్ సాండ్ స్టోన్ పనుల్లో వేగం పెంచాలని రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయం నిర్మాణ పనులను ప్రాంగణమంతా కలియతిరిగి పరిశీలించారు.
సివిల్ పనులను త్వరగా పూర్తి చేయాలని, అంతస్థుల వారీగా సమాంతరంగా జరగాలన్నారు. సీఎం కేసీఆర్ విధించిన గడువులోపు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ఏజెన్సీకి సూచించారు. మంత్రి వెంట ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, ఈఈ శశిధర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.