హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పీడ్ పెంచాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం సూచించారు. శుక్రవారం ఆబ్కారీ భవన్లో ఎక్సైజ్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్సైజ్, డ్రగ్స్ డిపార్టుమెంట్లు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, డ్రగ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ రామ్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.