ఎల్బీనగర్, అక్టోబర్ 21: డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్లు కేటాయించకుండా, తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న స్పెక్ట్రా సంస్థ కార్యాలయాన్ని బాధితులు సోమవారం ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి స్పెక్ట్రా యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్బీనగర్లోని స్పెక్ట్రా సంస్థ యాదగిరిగుట్ట, చౌటుప్పల్, షాద్నగర్ ప్రాంతాల్లో ప్లాట్లు ఇస్తామని డబ్బులు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తున్నదని ఆరోపించారు. గట్టిగా నిలదీస్తే డబ్బులు ఇస్తామంటూ చెక్కులు ఇచ్చారని, ఆ చెక్కులు బౌన్స్ అవుతున్నాయని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను సముదాయించినా న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకూర్చున్నారు.