హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను ఈ నెల 22, 28, 29 తేదీల్లో నడుపుతున్నట్టు ప్రకటించింది. కాగా, సికింద్రాబాద్ నుంచి మధురైకి ప్రతి మంగళవారం నడిచే రైలు రాకపోకలను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 26 వరకు పొడిగించింది.
మధురై నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరే రైలు వచ్చే నెల 28 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. సికింద్రాబాద్ నుంచి జైపూర్‌కు నడిచే రైలు సెప్టెంబర్ 30 వరకు, జైపూర్ నుంచి సికింద్రాబాద్ రైలును అక్టోబర్ 2 వరకు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.