హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): పండుగల వేళ ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నది. దసరా, దీపావళి, ఛత్ నేపథ్యంలో మణుగూరు-బెల్గావి మధ్య 190 రైలు సర్వీసులను నడుపనున్నట్టు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. మణుగూరు నుంచి బెల్గావికి 95, తిరుగు ప్రయాణంలో కూడా 95 చొప్పున ప్రత్యేక రైలు ట్రిప్పులను నడుపనున్నారు. ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. కాగా, తిరుపతి-జల్నా మధ్య 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 13నుంచి నవంబర్ 4 వరకు ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు.
హయత్నగర్, అక్టోబర్ 11: ప్రము ఖ కిన్నెర వాయిద్యాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య స్థలంలోని ప్రహరీని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి కూల్చివేశారు. హ యత్నగర్ రెవెన్యూ సర్వే నెం.207లో 600 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొగులయ్యకు కేటాయించిన విష యం తెలిసిందే. మొగులయ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసిన హయత్నగర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన స్థలాన్ని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.