హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 14 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో 6 రైళ్లు సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ మధ్య, 8 నాందేడ్-పన్వి, సనత్‌నగర్-రాయ్‌పూర్ మధ్య రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. ఈ నెల 29 నుంచి సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ స్టేషన్ల మధ్య రైళ్ల సేవలు ప్రారంభవుతాయని వెల్లడించింది. మిగతా రైళ్ల రాకపోకలు వచ్చే నెల 2 నుంచి మొదలవుతాయని పేర్కొంది.
టెస్టుల రిపోర్టులు వస్తేనే కారణాలు వెలుగులోకి.. ; కాళేశ్వరం కమిషన్ ఎదుట సీఈ సుధాకర్‌రెడ్డి హాజరు
హైదరాబాద్, అక్టోబర్26 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద ప్రస్తుతం టెస్ట్‌లు కొనసాగుతున్నాయని, ఆ ఫలితాలు వస్తేనే లోపాలకు కారణాలు ఏమిటనేవి తెలుస్తాయని రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ శనివారం సైతం కొనసాగింది. జస్టిస్ పీసీ ఘోష్ ఎదుట విచారణకు సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. బరాజ్ నిర్మాణం, డీపీఆర్, పిల్లర్ల కుంగుబాటు తదితర అంశాలపై కమిషన్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.