హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో నర్సాపూర్-బెంగుళూరు స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 28 వరకు ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. టికెట్లు, రిజర్వేషన్ల కోసం ఎస్సీఆర్ వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు తెలిపారు.
ప్రజావాణికి 574 అర్జీలు
హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): మహాత్మాజ్యోతిబా ఫూలే భవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో 574 అర్జీలు స్వీకరించినట్టు ప్రజాపాలన ప్రత్యేకాధికారి దివ్య ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా మైనార్టీ వెల్ఫేర్ శాఖకు 198, విద్యుత్ సమస్యల పరిష్కారానికి 99, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 98, రెవెన్యూకు 55, ప్రవాసీ ప్రజావాణికి 4, ఇతర శాఖలకు 94 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు.