Assembly Session | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఈ నెల 30న రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ నిర్ణయించారు. మూడోసభ రెండో సమావేశాల్లో భాగంగా 4వ సెషన్‌ను నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించిన నేపథ్యంలో సభను నిర్వహిస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
అదేరోజు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ నివాళి అర్పించనున్నది. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన క్యాబినెట్ సమావేశం వాయిదాపడినట్టు సచివాలయవర్గాలు తెలిపాయి. త్వరలోనే క్యాబినెట్ సమావేశం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నది.