అణచివేత భరించలేక..
దోపిడీ సహించలేక..
అవమానాలు తట్టుకొని..
హేళనను ఎదిరించి..
పీడితుల పక్షాన పిడికిలెత్తినవ్..
‘జై తెలంగాణ’ అని గొంతెత్తినవ్..
సావు నోట్లె తల వెట్టినవ్..
స్వరాష్ట్రం సాధించినవ్..
సకల జనులకు నీడవైనవ్..
సాగిపో ఇగ.. సంక్షేమ బాటలల్ల
ఒద్దు.. మీ మీటర్లొద్దమ్మ
ఒద్దు.. మీ చిల్లిగవ్వొద్దమ్మ
ఒద్దు.. మీ గారడీలొద్దమ్మ
ఒద్దు.. మీ జూటా మాటలొద్దమ్మ
గా స్వామినాథన్ సిఫారసులేవమ్మ..
అరవై లచ్చల రైతుల బత్కులు
ఆగం జేస్కోమమ్మా
ఇగ నిజం ఒప్పుకున్నందుకు
నీకో వందనమమ్మా.. ఓ నిర్మలమ్మా
మేమంతా నిమ్మలమేనమ్మా.
– సురేందర్ బండారు