‘కళ గొండల’ బృందానికి ఎమ్మెల్సీ కవిత అభినందన
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరపై ప్రత్యేక గీతాన్ని రూపొందించిన కళ గొండలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ ప్రత్యేక పండుగ సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభానికి గుర్తుగా ‘మేడారం జాతర-సమ్మక్క సారలమ్మ’ అనే అద్భుతమైన పాటను రూపొందించిన కళ గొండలకు, వారి టీమ్‌కు నా అభినందనలు’ అంటూ కవిత ట్వీట్ చేశారు. పాటకు సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను ట్వీట్‌తో షేర్ చేశారు.