TS ECET 2023 | హైదరాబాద్ : ఈ నెల 20న (శనివారం) నిర్వహించనున్న ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఆర్టీటీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఈ యాదగిరి తెలిపారు. రెండు సెషన్లకు అనుగుణంగా సిటీ బస్సులు నడిపిస్తామన్నారు. బస్సుల రాకపోకలు గురించి తెలుసుకోవడం కోసం కోఠిలో 9959226160, రేతిఫైల్ బస్టాండ్లో 9959226154 అనే మొబైల్ నంబర్లకు సంప్రదించాలన్నారు.