హైదరాబాద్ : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న నిర్వహించనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా నగరంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు శనివారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ తెలిపారు.
అబిడ్స్, ఈసీఐల్ ఎక్స్‌రోడ్, సికింద్రాబాద్ బ్లూసీ పాయింట్, ఎర్రగడ్డ, సుచిత్ర జంక్షన్, శంషాబాద్, ఘట్కేసర్, చాంద్రాయణగుట్ట, ఎర్రగడ్డ కేపీ వెళ్లే బస్‌స్టాప్, దిల్షుక్నగర్ – ఉమెన్స్ కాలేజీ, బ్రిలియంట్ కాలేజీ ఇనామ్‌గూడ, దిల్షుక్నగర్ – ఎల్బీనగర్, దుండిగల్, మెహిదీపట్నం, ఆరాంఘర్, టీకేఆర్ కమాన్ వంటి ప్రాంతాల నుంచి టీఎస్పీఎస్సీ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సౌకర్యాన్ని అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. అయితే ఈ ప్రత్యేక బస్సులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు.