హైదరాబాద్, సెప్టెంబర్14 (నమస్తే తెలంగాణ): సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక ట్రాన్స్ఫర్ పాలసీని రూపొందిస్తామని, కాలరీస్‌లో కాగి త రహిత కార్యకలాపాలు నిర్వహించేలా రెండు నెలల్లో ఈ-ఆఫీస్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. పర్సనల్ విభాగం పనితీరుపై హైదరాబాద్ సింగరేణిభవన్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బలరాం మాట్లాడుతూ సింగరేణిలో అధికారుల బదిలీ విషయంలో ప్రత్యేక పాలసీ ఉన్నదని, కానీ 40 వేల మంది కార్మికులకు ఎలాంటి బదిలీ విధానం లేదన్నా రు. పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక అప్లికేషన్(యాప్)ను రూపొందించాలని ఐటీ విభాగానికి ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో డైరెక్టర్లు సత్యనారాయణరావు, వేంకటేశ్వరరెడ్డి, జీఎంలు ఎస్డీఎం సుభానీ, రవిప్రసాద్ పాల్గొన్నారు.
వీకే ఓసీకి పర్యావరణ అనుమతులు
హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): కొత్తగూడెంలోని వీకే ఓపెన్ కాస్ట్ గనికి తొలి దశ పర్యావరణ అనుమతులొచ్చాయని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం వెల్లడించారు. రానున్న రెండునెలల్లో బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుదుత్పత్తి కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గును సరఫరా చేయాలన్నారు. రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో బొగ్గును రవాణా చేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో కోల్పోయిన ఉత్పత్తి నష్టాలను భర్తీచేసేందుకు కృషిచేయాలని సూచించారు. వీసీలో డైరెక్టర్లు జీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీ సత్యనారాయణరావు, జీఎం కో ఆర్డినేషన్ ఎస్డీఎం సుభాని, జీఎం జక్కం రమేశ్ పాల్గొన్నారు.