హైదరాబాద్, జనవరి 17 (నమస్తేతెలంగాణ): ఏపీలోని విశాఖ ఉకు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఏటా 7.3 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది. ఈ కంపెనీ 2023-24లో రూ.4,848.86 కోట్లు నష్టపోయింది. అంతకుముందు 2022-23లో రూ.2,858.74 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది.
నకిలీ విత్తనాలను అరికట్టాలి: కోదండరెడ్డి
హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టడంలో విత్తన కంపెనీలు భాగస్వామ్యం కావాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. విత్తనాలకు సంబంధించిన వివిధ కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం రైతు కమిషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలతో రైతులు ఎలా నష్టపోతున్నారనే విషయంపై చర్చించారు. సీడ్ కంపెనీలు విత్తన తయారీలో ఎదురవుతున్న సవాళ్లను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు కెవీఎన్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, భవానీరెడ్డి, రాములు నాయక్, గడుగు గంగాధర్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, సీడ్ కంపెనీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.