హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక అద్దె బస్సుల సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తుగా నగదు డిపాజిట్లు లేకుండానే బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను అద్దె కు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ బస్సుల్లోని అదనపు సీట్లలో ఇద్దరు గురుస్వాము లు, ఇద్దరు వంట మనుషులు, మణికం ఠ స్వాములు , ఒక అటెండర్‌కు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి సైతం ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ముం దస్తు సీట్ రిజర్వేషన్, శబరిమల యాత్ర కు కావాల్సిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్‌ల కోసం www.tsrtconline. in ను సందర్శించాలని సూచించారు. ఇత ర వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ 040-23450033, 69440000 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.