హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): సెరిబ్రల్ విజువల్ ఇంపెరియిర్మెంట్ (సీవీఐ) అనే కంటి జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన చికిత్స అందించేందుకు ‘కొలంబస్ గ్లోబల్ సర్వీసెస్ లిమిటెడ్’ అనే సంస్థ ముందుకొచ్చింది. బాధిత పిల్లలకు చికిత్స అందించేందుకు ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో శుక్రవారం ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ సందర్భంగా వైద్యనిపుణులు మాట్లాడుతూ సీవీఐ అనేది ఒక మెదడు ఆధారిత దృష్టిలోపం అని, కండ్లు సాధారణంగా పనిచేసినప్పటికీ ఏదైనా చూసిన దృశ్యాన్ని మెదడు గ్రహించలేదని, దీని వల్ల ఆ దృశ్యాన్ని సీవీఐ బాధితులు సరిగ్గా చూడలేరని, అర్థం చేసుకోలేరని వివరించారు. సాధారణంగా దృష్టి వైకల్యాలున్న పిల్లల్లో ప్రపంచ వ్యాప్తంగా 30-40% మంది బాధితులకు సీవీఐనే కారణమని చెప్పారు.
సీవీఐతో బాధపడే పిల్లలకు ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి, సరైన చికిత్స అందిస్తే సమస్య తీవ్రతరం కాకుండా అడ్డుకట్ట వేసి వారి దృష్టి వైకల్యాన్ని సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చని సూచించారు. ఎల్వీ ప్రసాద్ దవాఖానలో అందుబాటులోకి వచ్చిన సీవీఐ చికిత్స విభాగం ద్వారా బాధితులకు చికిత్స, రిహాబిలిటేషన్, కౌన్సిలింగ్, దృష్టి నైపుణ్యాల పెంపుపై శిక్షణ, స్పీచ్ థెరపీ వంటి సేవలు అందించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్వీపీ ఇనిస్టిట్యూట్ ఫర్ విజన్ రిహాబిలిటేషన్ అధిపతి డాక్టర్ బ్యూలా క్రిస్టీ, ఎల్వీప్రసాద్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్గర్గ్, కొలంబస్ గ్లోబల్ సర్వీసెస్ ఇండియా మ్రేనేజింగ్ డైరెక్టర్ కపిల్ మిశ్రాతో పాటు పలువురు సీవీఐ బాధిత తల్లిదండ్రులు పాల్గొన్నారు.దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.