హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక, గృహావసరాలకు విద్యుత్తు పంపిణీలో ఎలాంటి సమస్యల్లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందిన విద్యుత్తుశాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్‌శర్మ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో భాగంగా మరింత మెరుగైన సేవలందించేందుకు శాఖాపరంగా చేపట్టాల్సిన చర్యలపై ఔత్సహిక పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు సూచనలు స్వీకరించేందుకు ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సునీల్‌శర్మ, విద్యుత్తు శాఖ సీఎండీ జీ రఘుమారెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ఎస్పీడీసీఎల్ ఆన్లైన్లో అందిస్తున్న వివిధ సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు వివరించారు. కొత్త సర్వీసుల మంజూరు, దరఖాస్తుల పరిస్థితి, ఫిర్యాదుల ట్రాకింగ్, విద్యుత్తు బిల్లులు, అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని సంస్థ వెబ్సైట్ (www. tssouthernpower.com ) ద్వారా పొందాలని సూచించారు. సమావేశంలో ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు టీ శ్రీనివాస్, కే రాములు, పీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.